టీడీపీకి నో పర్మిషన్
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:45 AM
ఎన్నికలు సమీపిస్తున్నా కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా.. ప్రతిపక్షాలకు ఇబ్బందులు పెడుతున్నారు.
వైసీపీకి మాత్రం నో అబ్జక్షన్
చిత్తూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్నా కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా.. ప్రతిపక్షాలకు ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా గుడిపాలలో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా నరహరిపేట జడ్పీ హైస్కూల్ మైదానం ఉంది. ఇక్కడ జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని టీడీపీ నాయకులు ఎంపీడీవోను కోరారు. ఆ స్థలం తన పరిధిలో లేదని ఆయన చెప్పారు. దీంతో అనుమతి కోసం జడ్పీ సీఈవో గ్లోరియాకు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రానందున మైదానంలో సభ ఏర్పాటుకు అనుమతివ్వాలని, ఒకవేళ కోడ్ ఉన్నా అనుమతితో సభలు నిర్వహించుకోవచ్చనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘం సూచనల్ని దరఖాస్తుకు జత చేశారు. అయినా జడ్పీ సీఈవో గ్లోరియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో అనుమతివ్వలేదు. దీంతో టీడీపీ నాయకులు చేసేదేమీలేక వసంతాపురం టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా స్థలంలో జయహో బీసీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇంతవరకు బానే ఉన్నా.. అదే హైస్కూల్ మైదానంలో వైసీపీ నాయకులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు మాత్రం అధికారులు అనుమతులిస్తున్నారు. అసలు ఎలాంటి అనుమతిలేకుండానే సమావేశాలు నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. రెండు నెలల కిందట విజయానందరెడ్డి ఇదే మైదానంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి దుస్తుల పంపిణీ చేపట్టారు. అప్పుడు అధికారులకు నిబంధనలు గుర్తుకు రాలేదు. ఇక, ఈ నెల 11న కూడా ఇక్కడే మరో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం స్థలాన్ని పరిశీలించారు. టీడీపీ విషయంలో అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే అధికారులు, వైసీపీ కార్యక్రమాలకు అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Mar 08 , 2024 | 12:46 AM