ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కక్ష కట్టి.. నకిలీ హాల్‌ టికెట్‌ సృష్టించి..!

ABN, Publish Date - Feb 28 , 2024 | 12:42 AM

గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్షల్లో పట్టించాలని పన్నాగం తీరా హాల్‌ టికెట్‌ నకిలీదిగా తెలిసి ఫిర్యాదు అసలు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కర్నూలులో కుట్ర.. చిత్తూరులో వెలుగుచూసిన వైనం

మీడియా సమావేశంలో నిందితుడిని చూపిస్తున్న ఏఎస్పీ అరీఫుల్లా

చిత్తూరు, ఫిబ్రవరి 27: వారిద్దరూ బంధువులే. కానీ, రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలున్నాయి. దీనిని మనసులో పెట్టుకున్నాడు. గ్రూపు-2 ప్రిలిమినరీ స్ర్కీనింగ్‌ పరీక్షల్లో నకిలీ హాల్‌ టికెట్‌ను సృష్టించి ఇచ్చి.. పోలీసులకు పట్టించాలని పథకం పన్నాడు. తీరా అతడే నిందితుడిగా దొరికిపోయాడు. కర్నూలు జిల్లాలో మొదలైన ఈ కుట్ర.. చిత్తూరులో బయటపడింది. ఈ వివరాలను మంగళవారం చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఒకటో పట్ణణ సీఐ విశ్వనాథరెడ్డితో కలిసి ఏఎస్పీ అరీఫుల్లా మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం.. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన సుదర్శనం ఏపీపీఎస్సీ గ్రూపు-2 ప్రిలిమినరీ స్ర్కీనింగ్‌ పరీక్ష రాయాలని భావించారు. దీనికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని తన బంధువైన, కర్నూలు జిల్లా డోన్‌ నగరం రాజా కాంప్లెక్స్‌లోని మీ సేవా కేంద్రంలో పనిచేస్తున్న ఇమ్మానుయేలును అడిగారు. గతంలో తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైషమ్యాలను మనసులో పెట్టుకుని ఇమ్మానుయేలు దరఖాస్తు చేయకుండా మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. హాల్‌ టికెట్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. తనకు హాల్‌టికెట్‌ తీసివ్వాలని సుదర్శనం అడిగారు. అదే మీ సేవా కేంద్రంలో మండ్ల శ్రీనివాసులు అనే అభ్యర్థి ఒరిజనల్‌ హాల్‌ టికెట్‌ పీడీఎఫ్‌ ఉంది. దీనిని పీడీఎఫ్‌ కన్వర్షన్‌ అప్లికేషన్‌ ద్వారా ఎంఎస్‌ వర్డ్‌ అప్లికేషన్‌లోకి ఇమ్మానుయేలు మార్చాడు. సుదర్శనం వ్యక్తిగత వివరాలు, ఫొటోను మండ్ల శ్రీనివాసులు హాల్‌ టికెట్‌లో ఎడిట్‌ చేసి నకిలీ హాల్‌ టికెట్‌ను తయారు చేసిచ్చాడు. పరీక్షా కేంద్రాన్ని దూరంగా పెడితే వెళ్లడానికి సమయం చాలక... పరీక్ష రాయకుండా వచ్చేస్తాడని అనుకున్నాడు. అందుకని చిత్తూరు నగరం మర్రిమాను వీధిలోని నారాయణ కాలేజీని పరీక్షా కేంద్రంగా నకిలీ హాల్‌టికెట్‌లో చూపించాడు. ఒకవేళ సకాలంలో పరీక్షకు వెళితే నకిలీ హాల్‌ టికెట్‌ కావడంతో పోలీసులకు పట్టుబడతాడని, అప్పుడు తన పంతం నెరవేరుతుందని భావించాడు. ఇదేమి తెలియని సుదర్శనం ఆ హాల్‌ టికెట్‌తో ఈనెల 25వ తేదీన జరిగిన గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్షకోసం చిత్తూరుకు చేరుకున్నారు. ఆ హాల్‌ టికెట్‌లో చూపిన నారాయణ కాలేజీని ప్రభుత్వం పరీక్షా కేంద్రంగా ఎంపిక చేయలేదని తెలిసింది. దీంతో చిత్తూరులోని అధికారులను ఆయన కలిసి హాల్‌ టికెట్‌ చూపగా.. నకిలీదని గుర్తించారు. సుదర్శనం ఫిర్యాదు మేరకు చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. డోన్‌లో ఉన్న ఇమ్మానుయేలును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద ఉన్న కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరం రుజువుకావడంతో మంగళవారం ఇమ్మానుయేలును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో అసలైన నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.

Updated Date - Feb 28 , 2024 | 12:42 AM

Advertising
Advertising