మండుతున్న ఎండలు
ABN, Publish Date - Mar 07 , 2024 | 01:57 AM
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కసారిగా ఎండలు మండాయి.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 6: వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కసారిగా ఎండలు మండాయి. అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత ప్రారంభమైంది. బుధవారం చిత్తూరులో 35డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి ఆదివారం వరకు 35- 37డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాత్రివేళల్లోనూ ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు తగ్గడం లేదు. పెరుగుతున్న ఎండ తీవ్రతతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
Updated Date - Mar 07 , 2024 | 01:58 AM