పాకాల రైల్వేకాలనీలో దారుణ హత్య
ABN, Publish Date - Feb 27 , 2024 | 12:52 AM
పాకాల రైల్వే కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాలనీలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ సమీపంలో చింతచెట్ల కింద పాకాల పోలీ్‌సస్టేషన్‌కి కూతవేటు దూరంలో ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తిని తలపై బండరాయితో మోది చంపినట్లు స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు.
తలపై బండరాయితో మోది చంపేశారు
పాకాల, ఫిబ్రవరి 26: పాకాల రైల్వే కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాలనీలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ సమీపంలో చింతచెట్ల కింద పాకాల పోలీ్‌సస్టేషన్‌కి కూతవేటు దూరంలో ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తిని తలపై బండరాయితో మోది చంపినట్లు స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాకాల ఎస్‌ఐ2 ఇషాక్ బాషా, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 30 ఏళ్ల వయసు ఉంటుందని ప్యాంటు, షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. వ్యక్తిగత ఆధారాలేమీ లభ్యం కాలేదన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Feb 27 , 2024 | 12:52 AM