ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కుప్పానికి కృష్ణా జలాలు ఇవేనా?

ABN, Publish Date - Mar 08 , 2024 | 01:03 AM

అందరూ అనుకున్నట్టే జరిగింది. కుప్పానికి కృష్ణా జలాలు ఇచ్చేశామంటూ ఫిబ్రవరి 26న సీఎం జగన్‌ చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశం ఆవగింజంతైనా లేదని తేలిపోయింది.

గేట్‌ ఎగువ భాగంలో అడుగంటిన జలాలు

7కె.పి.ఎం.ఆర్‌.కె,ఎం 6: గేట్‌ ఎగువ భాగంలో అడుగంటిన జలాలు

రామకుప్పం, మార్చి 7: అందరూ అనుకున్నట్టే జరిగింది. కుప్పానికి కృష్ణా జలాలు ఇచ్చేశామంటూ ఫిబ్రవరి 26న సీఎం జగన్‌ చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశం ఆవగింజంతైనా లేదని తేలిపోయింది. రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీ-నీవా కాలువ గేటు ఎత్తి మరీ కుప్పం నియోజకవర్గానికి కృష్ణాజలాలను సీఎం విడుదల చేశారు. రెండు రోజులు గడవక ముందే కాలువలో జలప్రవాహం తగ్గిపోయింది. జనం, మీడియా గగ్గోలు పెట్టడంతో స్పందించిన అధికారులు నిజనిర్ధారణ పేరిట ఒక ప్రకటనను విడుదల చేశారు. రాజుపేట నుంచి కిలోమీటరు సమీపంలోని మద్దికుంట చెరువును జలాలతో నింపి, అక్కడి నుంచి నాగసముద్రం చెరువు, మణీంద్రం చెరువుల మీదుగా కెంచనబల్ల తోట్ల చెరువుకు జలాలు చేర్చే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే మద్దికుంట చెరువు నిండి మొరవ పోకుండానే, కాలువ గేటు మూసివేసి, జలాలను అత్తికుప్పం వీరాశీచెరువుకు వదిలారు. మద్దిచెరువుకు నీళ్లు చేరకుండా నాగసముద్రం, మణీంద్రం, తోట్లచెరువులను ఎలా నింపుతారన్నది అర్ధం కాలేదు. ఒక వేళ వీరాశీచెరువు నుంచి పంపుదామనుకున్నా సాధ్యమయ్యేపని కాదు. కారణం వీరాశీచెరువు నుంచి మణీంద్రం చెరువుకు జలాలు వెళ్లే వంక ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురై పూడ్చివేతకు గురైంది. వంక భూముల్లో పంటలతో పాటు పలుకుబడి కలిగిన పెద్దలుమామిడి చెట్లను నాటేశారు. మద్దికుంటకు జలాలను ఆపేసి, అత్తికుప్పం చెరువుతో పాటు శాంతిపురం మండలం జీడిగుట్ల వద్ద గల చిట్టేవానివంక వైపు కూడా జలాలను అధికారులు మళ్లించారు. దీంతో అన్ని చెరువులను నింపేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు హంద్రీ-నీవా కాలువల్లో దిగి వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. నిజానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాలువకు దగ్గరగా ఉన్న ఒకటి రెండు చెరువులకు కొన్ని నీళ్లు మళ్లించి, ఆ తర్వాత ఎంతదూరం వెళితే అంతదూరం కాలువలో జలాలను పారించాలని అనుకున్నా రెండు రోజులుగా రాజుపేట వద్ద గల హంద్రీ-నీవా కాలువలో జలప్రవాహం ఆగిపోయింది. గేటు ఎగువ భాగంలో అడుగంటి ఎండిపోయి కనిపిస్తోంది. దిగువ భాగంలో కాలువ ఎండిపోయి పచ్చిక మొలిచింది.

Updated Date - Mar 08 , 2024 | 01:34 AM

Advertising
Advertising