ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సినీ ఫక్కీలో మోసం

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:40 PM

పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంలో నగదు తీసి ఇస్తానని చెప్పి రూ.50 వేలను కాజేసిన చేసిన విషయాన్ని సింగనమల రాజేశ్వరి శుక్రవారం రాజంపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళను మోసగించి రూ.50 వేలు కాజేసిన యువకుడు

రాజంపేటటౌన్‌, మార్చి 1: పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంలో నగదు తీసి ఇస్తానని చెప్పి రూ.50 వేలను కాజేసిన చేసిన విషయాన్ని సింగనమల రాజేశ్వరి శుక్రవారం రాజంపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ఎస్‌బీఐ ఏడీబీ సమీపంలోని ఏటీఎంలో డబ్బులు కోసం వెళ్లిన రాజేశ్వరి ఎంత ప్రయత్నించినా డబ్బు రాలేదు. దాంతో, పక్కనే ఉన్న యువకుడు తాను ప్రయత్నిస్తానని చెప్పి, ఆమె వద్ద ఉన్న ఏటీఎం పాస్‌వర్డ్‌ తెలుసుకుని ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి సాధ్యం కాలేదని చెప్పి ఏటీఎం కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. గురువారం 1.30 గంటల సమయంలో ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును రూ.10 వేల చొప్పున 5 సార్లు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారుల ద్వారా తెలుసుకొని పట్టణ పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 11:40 PM

Advertising
Advertising