ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి : ఆర్డీఓ

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:34 AM

ధర్మవరం, మార్చి 3: ప్రతి ఓటరు వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఆర్డీఓ వెంకటశివారెడ్డి సూచించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై మాట్లాడారు.

ధర్మవరం, మార్చి 3: ప్రతి ఓటరు వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఆర్డీఓ వెంకటశివారెడ్డి సూచించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై మాట్లాడారు. బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో ఇప్పటికే పారదర్శకతో కూడిన ఓటరు జాబితాను తయారు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకారం అందించాలని కోరారు. ప్రతి పోలింగ్‌ బూతలో 1500 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే వాటిని మరొకపోలింగ్‌ బూతకు మార్పు చేస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుతం ఏర్పాటైన పోలింగ్‌ కేంద్రాలు శిథిలావస్థలో ఉంటే వాటిని కూడా మరో బిల్డింగ్‌కు మార్పుచేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో తాడిమర్రి మండలంలో పెద్దకోట్ల, ముదిగుబ్బ మండలంలో రామస్వామితండా, బత్తలపల్లి మండలంలో అనంతసాగరం, ధర్మవరం మండలంలో తుంపర్తి గ్రామాలలో కేంద్రాలను మార్పు చేయాల్సిందిగా గుర్తించామన్నారు. అనంతరం నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాలపై పలు సమస్యలను రాజకీయపార్టీల నాయకులు ఆర్డీఓ దృిష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకుడు మేకల రామాంజనేయులు, వైసీపీ నాయకుడు గుర్రంశీన, కాంగ్రెస్‌

నాయకుడు రంగన అశ్వర్థనారాయణ, బీజేపీ నాయకులు నబీరసూల్‌, రాప్తాటిరాము, నారాయణస్వామి యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:34 AM

Advertising
Advertising