కొనసాగుతున్న యువచైతన్య బస్సుయాత్ర
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:18 AM
మండలంలో తాడిపత్రి ము న్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చేపట్టిన యువచైతన్య బస్సుయాత్ర గురువారం కూడా కొనసాగింది.
తాడిపత్రిటౌన, మార్చి7: మండలంలో తాడిపత్రి ము న్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చేపట్టిన యువచైతన్య బస్సుయాత్ర గురువారం కూడా కొనసాగింది. మండలంలోని అక్కన్నపల్లి, హుస్సేనాపురం, వీరాపురం, బొందలదిన్నె, వంగనూరు, జంబులపాడు, కొండేపల్లి, చల్లవారిపల్లి, గన్నెవారిపల్లి గ్రామాల్లో ఆయన బస్సుయా త్ర సాగింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గ్రామంలో మహిళలు పెద్దఎత్తున జేసీపీఆర్‌కు హారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలను జేసీపీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోతో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, వెంకటనాయుడు, ప్రభాకర్‌నాయుడు, మండల కన్వీనర్ నరేంద్రనాయుడు, చల్లా సూరి, సోమశేఖర్‌నాయుడు, రమణ, ప్రసాద్, రవి, పవనకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 12:18 AM