పెనుకొండకు రా... కదలిరా..
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:30 AM
రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వ పీడితవర్గాలను ఏకం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న రా.. కదలిరా సభ పెనుకొండ నియోజకవర్గంలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కియ కార్ల పరిశ్రమ వద్ద సోమవారం సభ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎర్రమంచి గ్రామ పరిధి జాతీయ రహదారి పక్కన కియ కార్ల పరిశ్రమ ఎదురుగా 25 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేపట్టారు. లక్షమందికిపైగా జనం తరలివస్తారన్న అంచనాతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
చంద్రబాబు సభకు భారీ ఏర్పాట్లు
పోటెత్తనున్న జనం
పుట్టపర్తి, మార్చి2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వ పీడితవర్గాలను ఏకం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న రా.. కదలిరా సభ పెనుకొండ నియోజకవర్గంలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కియ కార్ల పరిశ్రమ వద్ద సోమవారం సభ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎర్రమంచి గ్రామ పరిధి జాతీయ రహదారి పక్కన కియ కార్ల పరిశ్రమ ఎదురుగా 25 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేపట్టారు. లక్షమందికిపైగా జనం తరలివస్తారన్న అంచనాతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలతోపాటు వైసీపీ అరాచకపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబునాయుడు దిశానిర్ధేశం చేయనున్నారు. టీడీపీ పాలనలో ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించి అంతర్జాతీయ కియ కార్ల పరిశ్రమను తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాను ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ తీసుకొచ్చింది లేదు. నీటి ప్రాజెక్టుల విధ్వంసంతోపాటు జిల్లాలో వైసీపీ సాగించిన అరాచకాలను ప్రధానంగా ప్రస్తావించననున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లాలో ఏం అభివృద్ధి చేస్తామో స్పష్టం చేడంతోపాటు ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటనలకు ముందు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావడంతో జిల్లాలో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా జనసమీకరణ చేస్తున్నారు. ఈ సభతో జిల్లాలో అన్ని నియోజకవర్గాలతోపాటు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుని, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామనీ, అందుకు పెనుకొండ సభ ద్వారా నాంది పలుకుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. టీడీపీ-జనసేన పొత్తు ఖరారై, సీట్ల ప్రకటన తరువాత జిల్లాలో నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇరు పార్టీల నేతలు, శ్రేణులు హాజరుకానున్నారు. ఇప్పటికే టీడీపీ ఇంటింటా తిరిగి సూపర్ సిక్స్ పథకాలను ప్రచారం చేస్తోంది. పెనుకొండలో నిర్వహిస్తున్న రా.. కదలిరా.. సభ 25వది కావడంతో విజయవంతం చేయడానికి టీడీపీ-జనసేన జిల్లా నేతలు సిద్ధమయ్యారు. జిల్లాలో అన్ని దారులు పెనుకొండ వైపే అన్న చందంగా ఇరు పార్టీల శ్రేణులతోపాటు రైతులు, కార్మికులు, యవత, మహిళలు సమాయత్తం అవుతున్నారు.
ముమ్మర ఏర్పాట్లు
హెలీప్యాడ్ పనుల పరిశీలన
పెనుకొండ రూరల్: మండలంలోని కియ కార్ల పరిశ్రమ వద్ద ఈనెల 4వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో తలపెట్టిన రా.. కదిలిరా.. సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టీడీపీ పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పార్టీ ఉమ్మడి జిల్లా ఇనచార్జి రవీంద్ర, టీడీపీ శ్రేణులతో కలిసి బహిరంగ సభావేదిక, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. సభాస్థలం కోసం ఎక్స్‌కవేటర్‌తో భూమి చదును పనులు శరవేగంగా చేపట్టారు. అనంతరం సవిత మాట్లాడుతూ.. కరువు జిల్లా అనంతను ఆదుకోవాలనే ఉద్దేశంతో హెచఎనఎ్‌సఎ్‌స పథకం కింద గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి, అంతర్జాతీయ కియ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయించిన విజన ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. పరిశ్రమ నిర్మాణంతో ఇతర రాష్ట్రాల నుంచి యువతీయువకులు ఇక్కడికొచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ నేపథ్యంలో రా.. కదిలిరా.. బహిరంగ సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన నాయకులు పెద్దఎత్తున హాజరై, విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డా.సునీల్‌కుమార్, గుట్టూరు మాజీ సర్పంచ సూర్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:30 AM