ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సూపర్‌ సిక్స్‌ పథకాలపై టీడీపీ ప్రచారం

ABN, Publish Date - Mar 12 , 2024 | 11:51 PM

టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తుందని టీడీపీ నాయకులు తెలిపారు. వారు మంగళవారం మండ లంలోని తాడంగిపల్లి, మోపర్లపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

తాడంగిపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

రొద్దం, మార్చి 12 : టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తుందని టీడీపీ నాయకులు తెలిపారు. వారు మంగళవారం మండ లంలోని తాడంగిపల్లి, మోపర్లపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ చేపట్టబోయే పథకాలపై వివరించారు. ప్రతి ఇంటికి యేడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 నగదు ఇస్తారన్నారు. రైతుకు రూ.20వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదు తదితర పథకాలను అమలు చేస్తుందన్నారు. రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. వైసీపీ ప్రభు త్వ ఆగడాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. టీడీపీ నాయకులు మాధవనాయుడు, చంద్రమౌళి, వెంకటరామిరెడ్డి, నరసింహులు, లింగప్ప, చెన్నకేశవులు, రామక్రిష్ణ, తిరుపాల్‌నాయుడు, మాజీ సర్పంచ రంగన్న, అరుణ్‌కుమార్‌రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:51 PM

Advertising
Advertising