పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సవిత.. సంబరాలు
ABN, Publish Date - Feb 25 , 2024 | 12:16 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించిన నేపథ్యంలో... పెనుకొండ నియోజకవర్గ అ భ్యర్థిగా కురుబ సామాజికవర్గానికి చెందిన సవితను ప్రకటించడంతో నియో జకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
పెనుకొండ టౌన, ఫిబ్రవరి 24 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించిన నేపథ్యంలో... పెనుకొండ నియోజకవర్గ అ భ్యర్థిగా కురుబ సామాజికవర్గానికి చెందిన సవితను ప్రకటించడంతో నియో జకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా సవిత తొలుత మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి స్వగ్రామం కొండం పల్లిలోని ఆయన సమాధివద్ద నివాళులర్పించారు. అనంతరం పెనుకొం డలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు, నాయ కులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె పట్టణంలో చాదర్‌ను తలపై ఎత్తుకుని ర్యాలీగా వెళ్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. ఊరువాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వ హించారు. అనంత రం పార్టీ కార్యాలయంలో సవిత మాట్లాడుతూ... అధికార పార్టీ అరాచకాలు, తెలుగుదేశం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ, చంద్రబాబు, నారా లోకేశ, అచ్చెన్నాయుడు తనను గుర్తిం చి నియోజ కవర్గ అభ్యర్థిగా ప్రకటించింనందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణం ఉన్నంతవరకు పార్టీకోసం కష్టపడతానని రెండు రోజుల్లో నాయకు లందరినీ ఒప్పించి ముందుకెళ్తానని అన్నారు. ఏ ఒక్క టీడీపీ నాయకుడు, కార్యకర్త మనసు నొప్పించేలా ప్రవర్తించనని, అందరికీ అందుబాటులో ఉంటా నని, రెండు రోజుల్లో కార్యచరణ సిద్దం చేసుకుని ప్రజల్లోకి వెళ్తానన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా యువత, కార్యకర్తలు, నాయకులు కార్యాలయానికి చేరుకుని ఆమెను పూలమాలలు, శాలువలతో సత్కరించారు. సవిత విజయా నికి కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుట్టూరు సూరి, సోము, నాయకులు బాబుల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటరమణ, మైనార్టీ నాయకుడు దాదు తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల: సవితను పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించ డంతో గోరంట్లలో పార్టీ శ్రేణులు శనివారం సంబరాలు జరుపుకున్నాయి. గోరంట్లలోని వినాయక ఆలయం నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కూడలిలో బాణసంచా పేల్చుతూ సవితమ్మ నాయ కత్వం వర్ధిల్లాలని నినాదాలుచేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు కక్కల రఘునాథ్‌రెడ్డి, నిమ్మల శ్రీధర్, బాలక్రిష్ణచౌదరి తదితరులున్నారు. అలాగే పాలసముద్రం గ్రామంలో టీడీపీ నాయకులు బస్ స్టాప్ వద్ద టపా సులు పేల్చి టీడీపీకి జైకొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజేష్‌నాయక్, కట్టుబడి ఆంజి, సుబహాన, రామలింగారెడ్డి, ప్రసాద్, శ్రీనివాసులు, పోతన్న, శివారెడ్డి, బాబా, అశోక్, నరేష్ తదితరులు ఉన్నారు.
Updated Date - Feb 25 , 2024 | 12:16 AM