ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మాటలకందని విషాదం

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:12 AM

ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది. చివరికి మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా కబళించేసి ఉన్న వారికి తీరని అన్యాయం చేసింది.

వేరుశనగ మిషనలో పడి మహిళ మృతి

తాడిమర్రి, మార్చి 7: ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది. చివరికి మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా కబళించేసి ఉన్న వారికి తీరని అన్యాయం చేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామానికి చెందిన పి.రమీజా(45) గురువారం సాయంత్రం ప్రమాదవ శాత్తూ మృతిచెందింది. ఆ మహిళే కుటుంభానికి జీవనాధారంగా ఉండేది. భర్త, కుమారుడు ఉన్నప్పటికీ వారు అనారోగ్య పరిస్థితులతో పనులకు వెళ్లలేని దుస్థితి. గతంలో రమీజా భర్త ఫకృద్దీన రోడ్డు ప్రమాదంలో గాయపడి పనులకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక 26 ఏళ్ల వయసు గల కుమారుడు బాషా బుద్దిమాంద్యంతో బాధ పడుతున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారికి వివాహాలు అయ్యాయి. కాగా పెద్ద కుమార్తె వన్నూరమ్మ భర్త 9 రోజుల క్రితం విద్యుతషాక్‌తో మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దీంతో కుటుంబ భారమంతా రమీజాపై పడింది. పొలం పనులు చేస్తూ వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆమెను కూడా మృత్యువు వెంటాడింది. రమీజా గురువారం అదే గ్రామానికి చెందిన కూలీలతో కలిసి వేరుశనగ కట్టెను మిషనలో ఆడించేందుకు వెళ్లింది. పెద్దకోట్ల గ్రామం వద్ద వేరుశనగ కట్టెను ఆడించారు. మధ్యాహ్నం భోజనం కోసం మిషన ఆఫ్‌ చేసి ఆ తరువాత ప్రారంభించారు. ఆ సమయంలో రమీజా తన బ్యాగును ఇంజన వద్ద ఉంచేందుకు వెళ్లగా.. ప్రమాదవ శాత్తు చీర కొంగు మిషన రాడ్డుకు తగులుకుంది. రాడ్డుకు ఎలాంటి పరికరం అడ్డుగా లేకపోవడంతో రమీజాను లాగేసింది. దీంతో ఆమె మెడ భాగం నుజ్జునుజ్జ అయి చూడటానికి కూడా వీలులేకుండా మారింది. మిషన యజమాని వెంటనే మిషన ఆఫ్‌ చేశాడు. అప్పటికే ఆమె మృతిచెందింది. తాడిమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. అల్లుడు చనిపోయి 9 రోజులు కాగానే ఇప్పుడు రమీజా మృత్యువు పాలైంది. దీంతో అనారోగ్యంతో ఉన్న భర్త, కుమారుడికి, భర్తను పోగొట్టుకున్న కుమార్తె, ఆమె పిల్లలు దిక్కులేనివారయ్యారు. వరుస ఘటనలతో వారి కుటుంబం చిధ్రమైంది. ఆ పేద కుటుంబానికి దేవుడు ఎందుకింత తిప్పలు పెడుతున్నాడోనని స్థానికులే కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - Mar 08 , 2024 | 12:12 AM

Advertising
Advertising