ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమిలినేనికి అపూర్వ ఆదరణ

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:25 AM

టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు జనం నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు శనివారం విశేషంగా తరలివచ్చారు. సురేంద్రబాబుకు మద్దతు తెలిపారు.

అమిలినేని సురేంద్రబాబును కలిసిన బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు

మండలాల నుంచి తరలివస్తున్న జనం

కళ్యాణదుర్గం, మార్చి 2

టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు జనం నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికకు వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు శనివారం విశేషంగా తరలివచ్చారు. సురేంద్రబాబుకు మద్దతు తెలిపారు. కళ్యాణదుర్గంలో టీడీపీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. శెట్టూరు, కుందుర్పి తదితర మండలాల నాయకులతోపాటు కళ్యాణదుర్గం పట్టణ, మండల నాయకులు సురేంద్రబాబును శనివారం కలిశారు. ఎంకొత్తూరు గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి అభినందించారు. శెట్టూరు మండలం బొచ్చుపల్లి నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. కుందుర్పి మండలం నుంచి ముస్లిం మైనార్టీ నాయకులు వచ్చి సురేంద్రబాబును సత్కరించారు. బెంగళూరు టీడీపీ ఫోరమ్‌ సభ్యులు రాజు, కేటీ చౌదరి, వెంకటేష్‌, అనిల్‌, శ్రీకాంత్‌, హరికృష్న, బాలచంద్ర, వినోద్‌, పృథ్వీ, వేణు, చందు, తిమ్మప్ప, నవీన్‌, విజయ్‌ నారాయణ, చంద్ర, ప్రతాప్‌, వన్నూరుస్వామి తదితరులు ప్రజావేదికలో అమిలినేనిని కలిసి మద్దతు తెలిపారు. పాస్టర్‌ అరుణకుమారి అమిలినేనిను కలిసి టీడీపీ విజయానికి కృషి చేస్తామని మద్దతు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రజావేదిక రద్దీగా కనిపించింది.

Updated Date - Mar 03 , 2024 | 12:26 AM

Advertising
Advertising