అయ్యప్పస్వామిగా కాశీవిశ్వేశ్వరుడు
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:05 AM
స్థానిక మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం స్వామివారు అయ్యప్పస్వామిగా భక్తులకు కనువిందు చేశారు.
అనంతపురం కల్చరల్, మార్చి 2: స్థానిక మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం స్వామివారు అయ్యప్పస్వామిగా భక్తులకు కనువిందు చేశారు. ఉదయం ఆలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలు, విశేష పూజాకార్యక్రమాలు చేశారు. ఆలయ ఆవరణలో దీక్షాహోమం నిర్వహించారు. సాయంత్రం వివిధరకాల పష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన వ్యాఘ్ర వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తిని ఆశీనులు గావించి అయ్యప్పస్వామిగా అలంకరించి ఊరేగించారు. ఆలయ ఈఓ రమే్‌షబాబు, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, ధర్మకర్తల మండలి సభ్యులు కల్పన, రాజేశ్వరి, వెంకటస్వామి, సురే్‌షబాబు, తిమ్మారెడ్డి, చంద్రశేఖర్, డి.సుబ్రహ్మణ్యం, ప్రధానార్చకుడు నరసింహశాసి్త్ర, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:05 AM