వైసీపీ నుంచి టీ డీపీలోకి చేరిక
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:28 AM
నంబులపూలకుంట, మార్చి 2: మండలకేంద్రానికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీతీర్థం పుచ్చుకున్నారు. కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ నివాసంలో వారు పార్టీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
నంబులపూలకుంట, మార్చి 2: మండలకేంద్రానికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీతీర్థం పుచ్చుకున్నారు. కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ నివాసంలో వారు పార్టీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్ట పడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. చేరిన వారిలో ఖాదర్‌వలీ, అమానుల్లా, ముబారక్, బాబ్‌జాన, రఘునాథ రెడ్డి, చాంద్‌బాషా, చిన్న ఆంజనేయులు, లోకేష్; షబ్బానా, మసూద్, వెంకటరమణ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పవనకుమార్, దండే రవి, పాలగిరి బాషా, అజంతుల్లా, దండే గంగశేఖర్, రాహూల్‌బాబా, బీసీ సెల్ రవి ఉన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:28 AM