ఇంటిపై పార్టీ జెండా కట్టడం నేరమా?
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:15 AM
వైసీపీ నాయకులు గ్రా మాల్లో ప్రచారానికి వె ళ్లినప్పుడు ఇతర పార్టీల జెండా ఇళ్లపై ఉండడం నేరామా అని మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుల నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు.
సీఐపై ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేస్తాం: మాజీ ఎంపీ నిమ్మల
గోరంట్ల, మార్చి 2: వైసీపీ నాయకులు గ్రా మాల్లో ప్రచారానికి వె ళ్లినప్పుడు ఇతర పార్టీల జెండా ఇళ్లపై ఉండడం నేరామా అని మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుల నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. గో రంట్లలోని ఆయన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మండలంలోని జీన వాండ్లపల్లిలో టీడీపీ కార్యకర్త హనుమంతు ఇంటిపై పార్టీ జెండా ఉందని వైసీపీ నాయకులు పోలీసులతో కొట్టించడం ఏమిటన్నారు. ఏమి నేరం చేశారని ఇలా చేస్తారన్నారు. ఎన్నికల నోటిఫికేషన రాకముందే సీఐ సుబ్బరాయుడు ఇలా ప్రవర్తిస్తుంటే ఎలాగన్నారు. ఇలాంటి అఽధికారులు ఉండకూడదని, వీరి వలన ఎన్నిక లు ఏకపక్షంగా జరిగే అవకాశముండదన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుండడంతో దీన్ని ఇంతటితో వదలేది లేదన్నారు. సీఐపై ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసంఘటనపై వెంటనే అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటివి పునావృతం అయితే ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేయడంతోపాటు, పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషనవద్ద ధర్నా నిర్వహించి, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
చంద్రబాబు సభకు తరలిరండి
పెనుకొండ నియోజకవర్గంలోని కియ పరిశ్రమ వద్ద సోమవారం జరిగే చంద్రబాబునాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు. వైసీపీ ఐదేళ్ల దుర్మార్గపు పాలనతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు సందేశం వినడానికి ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారన్నారు. రెండువందల వాహనాల్లో పదివేలమందిని గోరంట్ల నుంచి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం, నరేష్, బాలక్రిష్ణచౌదరి, కక్కల రఘునాథ్‌రెడ్డి, నిమ్మల శ్రీధర్, జనసేన నాయకులు సంతోష్, సురేష్, వెంకటేష్ తదితరులున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:15 AM