పాఠశాల స్థలంలో మళ్లీ అక్రమ నిర్మాణాలు
ABN, Publish Date - Mar 01 , 2024 | 11:54 PM
ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను స్టేషనకు పిలిపించడం, కేసుల్లో ఇరికించడం, ఇళ్లను కూల్చడం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నైజం. వైసీపీ అనుసరిస్తున్న విధానాలు పల్లెలకు పాకుతోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని విద్యాశాఖాధికారులు వైసీపీ సర్పంచుకు నోటీసులు అందించినా వారు లెక్కచేయలేదు.
వైసీపీ సర్పంచకు నోటీసు ఇచ్చినా లెక్కచేయని వైనం
పెనుకొండ రూర ల్, మార్చి 1: ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను స్టేషనకు పిలిపించడం, కేసుల్లో ఇరికించడం, ఇళ్లను కూల్చడం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నైజం. వైసీపీ అనుసరిస్తున్న విధానాలు పల్లెలకు పాకుతోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని విద్యాశాఖాధికారులు వైసీపీ సర్పంచుకు నోటీసులు అందించినా వారు లెక్కచేయలేదు. మళ్లీ పాఠశాల స్థలంలో ప్రహరీ నిర్మాణ పనులతో విద్యాశాఖాధికారులకు తలనొప్పిగా మారింది. ఈ సంఘటన పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే కురుబవాండ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల స్థలంలో సిమెంటులారీ వెళ్లడంలేదని రెండు నెలల క్రితం వైసీపీ సర్పంచ నాగమూర్తి పాఠశాల ప్రహరీని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పాత ప్రహరీ స్థలం నుంచి 10మీటర్ల వెనక్కు జరిపి పాఠశాల స్థలంలో తీయించిన గుంతలవల్ల విద్యార్థులు ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందని సర్పంచ నాగమూర్తికి విద్యాశాఖాధికారి విన్నవించారు. వారు పట్టించుకోకపోవడంతో గతనెల ఎంఈఓ సుధాకర్, చంద్రశేఖర్ పాఠశాలలో తవ్విన గుంతలను పూడ్చివేయించారు. శుక్రవారం సాయంత్రం సర్పంచ పాఠశాల స్థలంలో మళ్లీ అక్రమంగా నిర్మాణాలు చేపట్టేందుకు పూనుకున్నాడు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - Mar 01 , 2024 | 11:54 PM