ఇనగలూరులో తాగునీటి సమస్య
ABN, Publish Date - Mar 04 , 2024 | 12:12 AM
మండలంలోని ఇనగ లూరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆ గ్రామస్థులు కేతప్ప, మంజునాథ్, నరసిం హప్ప, రాజు, లక్ష్మమ్మ, రామాంజమ్మ, తదితరు లు తెలిపారు.
అగళి, మార్చి 3 : మండలంలోని ఇనగ లూరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆ గ్రామస్థులు కేతప్ప, మంజునాథ్, నరసిం హప్ప, రాజు, లక్ష్మమ్మ, రామాంజమ్మ, తదితరు లు తెలిపారు. ఆరు నెల లుగా ఎన్టీఆర్ సుజల స్రవంతి నీరు రావడం లేదన్నారు. అది చెడిపో యినా నేటికీ మరమ్మతులు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల తాగునీటి కోసం ఎన్టీఆర్ సుజల స్రవంతిని ఏర్పాటు చేశారు. అది పనిచేయక తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందు లు పడుతున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎన్టీఆర్ సుజల స్రవంతి నీటిని ప్రజలకు అందించాలని కోరారు.
Updated Date - Mar 04 , 2024 | 12:12 AM