ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:09 AM

మండలపరిధిలోని మరవకొత్తపల్లి బీసీ కాలనీలో కొన్నాళ్లుగా తాగునీటి సమస్య తీవ్రమైందని, వెంటనే సమస్య పరిష్కరించాలంటూ స్థానికులు రోడ్డెక్కారు.

రోడ్డుపై బైటాయించిన మరవకొత్తపల్లి బీసీ కాలనీ వాసులు

చిలమత్తూరు, మార్చి 3: మండలపరిధిలోని మరవకొత్తపల్లి బీసీ కాలనీలో కొన్నాళ్లుగా తాగునీటి సమస్య తీవ్రమైందని, వెంటనే సమస్య పరిష్కరించాలంటూ స్థానికులు రోడ్డెక్కారు. గ్రామంలోని లేపాక్షి- కొడికొండ చెక్‌పోస్టు 544-ఈ రహదారి పై ఆదివారం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. వారికి సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. కాలనీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, తాగునీటి పథకం మోటారు పనిచేయని కారణంగా సమస్య వస్తోంద న్నా రు. వెంటనే కాలనీలో కొత్తబోరు ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా జాతీయ రహదారికి ఆనుకొనే నివాస గృహాలు ఉన్నాయని, వాహనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వారం రోజుల కిందట ఇదే ప్రాంతంలో ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు స్పీడు బ్రేకర్లు వేయాలని ఆందోళన చేపట్టినా అధికారులు పట్టించుకోలే దన్నారు. కాలనీ వాసుల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని కాలనీ వాసులను శాంతిపర్చే చర్యలు చేపట్టారు. కా లనీలో తాగునీటి సమ స్య, జాతీయ రహదారి పై స్పీడు బ్రేకర్ల విష యం గురించి సంబంధి త అధికారులతో మా ట్లాడి పరిష్కా రమయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీ వాసు లు ఆందోళన విరమించారు.

Updated Date - Mar 04 , 2024 | 12:09 AM

Advertising
Advertising