4న పెనుకొండకు చంద్రబాబు
ABN, Publish Date - Mar 01 , 2024 | 11:53 PM
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 4న శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు వస్తున్నారు. పెనుకొండ సమీపంలోని కియ కార్ల పరిశ్రమ ఎదురుగా ‘రా కదలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ 5వ జోన ఇనచార్జి రవీంద్ర, పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థి సవిత శుక్రవారం తెలిపారు.
పెనుకొండ టౌన, మార్చి 1: టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 4న శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు వస్తున్నారు. పెనుకొండ సమీపంలోని కియ కార్ల పరిశ్రమ ఎదురుగా ‘రా కదలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ 5వ జోన ఇనచార్జి రవీంద్ర, పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థి సవిత శుక్రవారం తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన కియ పరిశ్రమ ద్వారా వేలాది కుటుంబాలు బాగుపడ్డాయని వారు అన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈనెల 4న టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను వారు పరిశీలించారు.
Updated Date - Mar 01 , 2024 | 11:53 PM