డ్వాక్రా సంఘాల ఏర్పాటు ఘనత చంద్రబాబుదే..
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:29 AM
ధర్మవరం, మార్చి 2: మహిళల ఆర్థికాభివృద్ధికి, అభ్యున్నతికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో కృషి చేశారని, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్ సతీమణి పరిటాల జ్ఞాన పేర్కొన్నారు.
- భవిష్యత్తుకు గ్యారెంటీలో పరిటాల జ్ఞాన
ధర్మవరం, మార్చి 2: మహిళల ఆర్థికాభివృద్ధికి, అభ్యున్నతికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో కృషి చేశారని, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్ సతీమణి పరిటాల జ్ఞాన పేర్కొన్నారు. పట్టణంలోని 2వ వార్డులో శనివారం ఆమె బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో మహి ళలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. ఆమె ఇంటింటా తిరుగుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకాల వల్ల ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గతంలోనూ చంద్రబాబు మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనించాలంటే చంద్రబాబు సీఎం కావాలని అన్నారు. రాబోవు ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా, పరిటాల శ్రీరామ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని రాష్ట్రాన్ని, ఇక్కడ ధర్మవరాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సీఎం జగన పన్నుల రూపంలో ప్రజలను బాదేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో తెలుగుమహిళలు ముతుకూరుబీబీ, మాదనమహేశ్వరి,
భీమనేని గీతావాణి, స్వర్ణకుమారి,మున్నీ, బాను, నాగరత్న, శారద,సునంద,మీనాక్షమ్మ, మాలతి, వసంత,ఇందిర, రమాదేవి,ప్యారీమా, వహీదా, కత్తులసునీత,నాగూర్‌బీ, షమీమ్, అశ్వర్థమ్మ, ఆదెమ్మ, నాయకులు పరిశేసుధాకర్, ఫణికుమార్, తలారి చంద్రమోహనబాబు, నాగూర్‌హుస్సేన, కేశగాళ్లశీన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:29 AM