అశేష జనవాహినితో అమిలినేని ఎన్నికల ప్రచారం
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:15 AM
అశేష జనవాహిని మధ్య టీడీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
కళ్యాణదుర్గం, మార్చి 7: అశేష జనవాహిని మధ్య టీడీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గురువారం శీబాయి గ్రామం నుంచి ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. కార్యకర్తలు, నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ అడుగడుగునా పూలవర్షం కురిపించారు. ముందుగా గ్రామ దేవతకు పూజలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య జెండాఊపి ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. కొన్ని చోట్ల గ్రామస్థులు సమస్యలను విన్నవించుకున్నారు. సురేంద్రబాబు మాట్లాడుతూ తొలిరోజు ప్రచారానికి అనూహ్యస్పందన వచ్చిందన్నారు. అన్నిచోట్ల ప్రజలు టీడీపీపై అభిమానం చాటుతున్నారన్నారు. నియోజకవర్గంలోని 114 చెరువులకు రెండున్నరేళ్లలో కృష్ణాజలాలను మళ్లించడానికి కృషి చేసి, తన ప్రధానమైన హామీని నెరవేర్చుకుంటానని తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మెనిఫెస్టోను 100 శాతం అమలు చేస్తూ, నియోజకవర్గంలో తాను కూడా సొంతంగా మెనిఫెస్టోను తయారుచేసి ప్రజల ముందుకు తీసుకెళ్తానని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 12:15 AM