ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తీవ్రమవుతున్న గ్రాసం కొరత

ABN, Publish Date - Mar 04 , 2024 | 11:58 PM

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలో కరువు కరాళనృ త్యం చేస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్బర పరిస్థితి చూడలేదని వృ ద్ధులు పేర్కొంటున్నారు.

దూర ప్రాంతం నుంచి గడ్డిని కొనుగోలు చేసి తీసుకొస్తున్న దృశ్యం

కబేళాలకు తరలుతున్న పశువులు

తగ్గుతున్న పాల దిగుబడి

కుదేలవుతున్న పాడి పరిశ్రమ

మడకశిర, మార్చి 4: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలో కరువు కరాళనృ త్యం చేస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్బర పరిస్థితి చూడలేదని వృ ద్ధులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం వర్షాలు కురువక పోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీటిమట్టం బాగా తగ్గిపోయింది. దీంతో బోర్ల కింద పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షాభావం వల్ల గత సంవత్సరం ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. రబీలో అనుకుంత మేర పంటలు సాగుకాలేదు. దీంతో జిల్లాలో గ్రాసం కొరత రోజురో జుకు తీవ్రమవుతోంది. జిల్లాలో వ్యవసాయం తరు వాత అధికంగా రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రాసం కొరతతో పాటు దానా, ఆవుల ధరలు పెరగడంతో ప్రస్తుతం ఉన్న పాల ధరలు గిట్టు పాటు కావడం లేదని రైతులంటున్నా రు. పాలధరలు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. చెరువుల్లో నీరు అడుగంటి పోతుండడంతో వాటి పరిసరాల్లోని బోర్లు ఎండి పోతున్నాయి. దీంతో వాటి కింద సాగు విస్తీర్ణం బాగా తగ్గి, పశువులకు గ్రాసం సమకూర్చడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ఇప్పటికే 21 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించా రు. అందులో తీవ్ర కరువు మండలాలు ఏడుకాగా మిగిలిన 41 మం డలాలు తీవ్రత తక్కువగా ఉన్నవి. గత యేడు పంటలు దెబ్బతిని గ్రాసం కొరత తీవ్రం కావడంతో ప్రభుత్వం జిల్లాలో మూడు చోట్ల గడ్డి కేంద్రాలను ఏర్పా టుచేసింది. పశువులకు గ్రాసాన్ని సరఫరా చేసింది. ఈ యేడు గ్రాసం కొరత అంత కంటే ఎక్కువగా ఉందని, గడ్డి కేంద్రాలను ఏర్పాటుచేయాలని రైతులు వి జ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో 23 మండలాల్లో ఇప్పటికే గ్రాసం కొరత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఉన్నతాధి కారులకు ప్రతిపాదనలు పంపినట్లు సంబంధిత శాఖాధికారుల సమాచారం. కరువు బృందం జిల్లాలో పర్యటించినప్పుడు గ్రాసం కొరతపై తయారు చేసిన నివేదికను అందజేశారు.

జిల్లాలో 3.26లక్షల పశువులు

జిల్లాలో 3.26 లక్షలు పాడి పశువులు ఉన్నాయి. అందులో 2.50 లక్షల ఆవులు , 80వేల దాకా గేదెలు ఉన్నాయి. మేకలు, గొర్రెలు 31 లక్షల దాకా ఉన్నాయి. పశువులకు సంబంధించి జిల్లాకు 633 మెట్రిక్‌ టన్నుల గడ్డి అవసరం ఉంది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వర్షాలు కురవక పోవడం పంటలు ఎండి పోతుండడంతో రైతులు మధ్యలోనే పంటంను తొలిగించారు. దీనికి తోడు రబీ సాగు తగ్గడంతో గ్రాసం కొరత తీవ్రం రూపం దాల్చింది. దీంతో గడ్డి ధరలు విపరీతంగా పెరిగాయి. ట్రాక్టర్‌ గడ్డి రూ. 12వేల నుంచి రూ. 15 వేల దాకా పలుకుతోంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం గడ్డి కొరత తీవ్రంగా ఉందని రైతులు అంటున్నారు. గతంలో మాదిరి గా గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా గడ్డిని అందించాలని కోరుతున్నారు. పదేళ్ల కిందటి పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో పశువులకు తాగు నీటి సౌకర్యం లేకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నామన్నారు. గడ్డి కొరత వల్ల పాలిస్తే పశువులను కూడా కబేళాలకు తరలించాల్సి వస్తోందని కంటతడిపెడుతున్నారు.

గిట్టుబాటు కాని పాల ధరలు

ట్రాక్టర్‌ గడ్డి రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఉందని, అంత డబ్బు పెట్టి కొనుగోలుచేయలేకపోతున్నామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. పశువులకు గ్రాసం సక్రమంగా వేయకపోవడం వలన పాల దిగుబడి తగ్గుతోం దంటున్నారు. ప్రస్తుతం దానాతో పాటు గడ్డి ధరలు పెరగాయని, కావున ప్రస్తుతం ఉన్న పాలధరలు గిట్టుపాటు కావడం లేదంటున్నారు. ఆవుపాలు లీట రు ధర రూ.35 నుంచి రూ.45 దాకా ఉంది. వెన్నశాతం బట్టి పాలధర ఇస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులలో వెన్నశాతం సరిగా రావడం లేదని, వెన్న శాతంతో నిమ్తిం లేకుండా లీటరు పాలను రూ.50తో కొనగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

గ్రాసం కొరతతో ఇబ్బందులు పడుతున్నాం - చిత్రశేఖర్‌, రైతు, వస గొల్లహట్టి

గత యేడాది వేరుశనగ పంట దెబ్బతింది. కనీసం పశుగ్రాసమైన దక్కుతుందనుకుంటే.... వర్షం లేకపోవడంతో పంట పోయింది. దీంతో పశువులకు మేతలేక ఇబ్బందులు పడుతున్నాం. నాకు ఒక గేదే, ఆవు , మేకలున్నాయి. ఒక మోపు గడ్డికి రూ.300 ఇచ్చి కొనుగోలుచేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి పశుగ్రాసం సరఫరాచేయాలి.

గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలి - హనుమంతరాయప్ప, రైతు, అగళి

పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. బయట మార్కెట్‌లో ట్రాక్టరు లోడు గడ్డి రూ.12వేలు దాకా ఉంది. కొందమంటే అది కూడా సరిగా దొరకడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లి కోనగోలు చేయాల్సి ఉంది. ఎక్కడ కాసంత గడ్డి ఉన్నా అక్కడికి పశువులను తోలుకెళ్తున్నాం. నాకు 20 వరకు పశువులున్నాయి. వాటికి గడ్డి సమకూర్చ లేక పోతున్నాం. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గడ్డి కేంద్రాలను ఏర్పాటుచేసి పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలి. లేకపోతే సబ్సిడీతోనైనా గడ్డిని పంపిణీ చేయాలి.

Updated Date - Mar 04 , 2024 | 11:58 PM

Advertising
Advertising