ముక్కంటి ఆలయంపై ఎగిరిన డ్రోన్
ABN, Publish Date - Mar 04 , 2024 | 03:13 AM
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్ కెమెరాతో తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులు వీడియోలను చిత్రీకరించారు. వీరిని ఆలయ సెక్యూరిటీ గుర్తించి పోలీసులకు అప్పగించారు.
శనివారం అర్ధరాత్రి వీడియోల చిత్రీకరణ
పోలీసుల అదుపులో ఐదుగురు తమిళనాడు యువకులు
శ్రీకాళహస్తి, మార్చి 3: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్ కెమెరాతో తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులు వీడియోలను చిత్రీకరించారు. వీరిని ఆలయ సెక్యూరిటీ గుర్తించి పోలీసులకు అప్పగించారు. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్ కన్నన్, శంకర్ శర్మ, అరవింద్, పోర్చే జీఎన్ తిరుమల శ్రీవారిని దర్శించుకునిశనివారం రాత్రి శ్రీకాళహస్తికి చేరుకున్నారు. ముక్కంటి ఆలయానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు అతిథి గృహంలో గది అద్దెకు తీసుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడంతో ఆలయ పరిసరాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు. వీటిన్నింటినీ చిత్రీకరించాలని ఆ యువకులు భావించారు. తాముంటున్న అతిథి గృహం భవనం పైనుంచి డ్రోన్ కెమెరాతో అర్ధరాత్రి ప్రధాన ఆలయంలో చిత్రీకరించారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత డ్రోన్‌ను వెంబడించి యువకులను గుర్తించారు. శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు.
Updated Date - Mar 04 , 2024 | 10:29 AM