యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2023-04-19T17:14:57+05:30
యువత దేశానికి బలం. ఏ దేశంలోనైనా యువత నాశనం అయితే ఆ దేశ భవిష్యత్ అంధకారమవుతోంది.
యువత దేశానికి బలం. ఏ దేశంలోనైనా యువత నాశనం అయితే ఆ దేశ భవిష్యత్ అంధకారమవుతోంది. అయితే చాలా దేశాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో యువత నిరాశలో ఉండి డిప్రెషన్‌కు గురవుతారు. అయితే దక్షిణ కొరియా ప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఉపాధి కల్పించడమే కాకుండా నిరుద్యోగులకు ప్రతినెల రూ. 40 ఇస్తామని ప్రకటించింది. యువతను చైతన్యపరచడం కోసమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని దక్షిణ కొరియా ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఈ వార్త దక్షిణ కొరియాలోనే కాదు.. చాలా దేశాల్లో చర్చనియాంశంగా మారింది.
Updated Date - 2023-04-19T17:16:40+05:30 IST