ఇంత ఘోరం 50 ఏళ్లలో చూడలేదు..
ABN, First Publish Date - 2023-07-20T14:01:33+05:30
సర్వ నాశనం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యాలు. నీరు పగ బడితే ఇలాగే ఉంటుంది. ఊళ్లకు ఊళ్లనే మింగేస్తుంది. వందలమందిని ఊడ్చిపెట్టేస్తుంది. అసలు దీని వెనుక కారణం తెలుసా?
Internet Dept.: సర్వ నాశనం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యాలు. నీరు పగ బడితే ఇలాగే ఉంటుంది. ఊళ్లకు ఊళ్లనే మింగేస్తుంది. వందలమందిని ఊడ్చిపెట్టేస్తుంది. అసలు దీని వెనుక కారణం తెలుసా? అది తెలిస్తే వణికిపోతారు. దేశంలో ఈసారి వర్షపాతం సాధారణంగానే ఉండవచ్చునని వాతావరణ శాఖ ఇదివరకు పలుమార్లు చెప్పింది. కానీ అంచనాలకు అందకుండా సాగిన రుతుపవనాలు ఒకే సమయంలో భిన్న ప్రాంతాలను కష్టనష్టాలపాలు చేశాయి. భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్ అతలాకుతలమవుతున్నాయి. గడిచిన 50 ఏళ్లలో ఏనాడూ ఇంతటి ఘోరం చూడలేదని హిమాచల్ ముఖ్యమంత్రి అన్నారు.
Updated Date - 2023-07-20T14:08:28+05:30 IST