వరదలు, భూ ప్రకంపనలతో అమెరికా అతలాకుతలం
ABN, First Publish Date - 2023-08-22T12:55:30+05:30
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన శక్తిమంతమైన హరికేన్ హిల్లరీ ఓవైపు తీవ్రస్థాయిలో ప్రతాపం చూపుతుండగా, మరోవైపు భూ కంపం సంభవించడంతో అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా వణికిపోయింది.
ABN Digital: అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన శక్తిమంతమైన హరికేన్ హిల్లరీ ఓవైపు తీవ్రస్థాయిలో ప్రతాపం చూపుతుండగా, మరోవైపు భూ కంపం సంభవించడంతో అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా వణికిపోయింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. ఆదివారం రోజు మొదటిసారి 5.1 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని అమెరికాలో జూలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. ఇంకోసారి 3.1, 3.6 తీవ్రతతో మరో రెండు ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. లాస్ ఏంజెల్స్ నగరంలోనూ ప్రకంపనలు వచ్చాయి. భూ కంపానికి సంబంధించి ఆస్తినష్టం, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-22T12:55:30+05:30 IST