సీఎం జగన్ పత్తికొండ పర్యటన ఎందుకు వాయిదా పడిందంటే..
ABN, First Publish Date - 2023-05-31T11:17:38+05:30
కర్నూలు జిల్లా: సీఎం జగన్ కర్నూలు జిల్లా, పత్తికొండ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి పత్తికొండలో రైతు భరోసా ప్రారంభ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అయితే...
కర్నూలు జిల్లా: సీఎం జగన్ కర్నూలు జిల్లా, పత్తికొండ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి పత్తికొండలో రైతు భరోసా ప్రారంభ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమానికి సడన్ బ్రేక్ పడింది. జూన్ 1వ తేదీ (బుధవారం)కి వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ ప్రకటన కర్నూలు రాజకీయ వర్గల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ బీజేపీ పెద్దలను ఆయన కలుస్తున్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఆలస్యం కావడంతో జగన్ ఢిల్లీ పర్యటన పూర్తి కాలేదని, దీంతో ఆయన అనుకున్న సమయానికి రాష్ట్రానికి తిరిగి రాలేకపోయారని చెబుతున్నారు. ఇదే పత్తికొండ పర్యటన వాయిదా పడటానికి ప్రదాన కారణమని జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. అయితే అసలు కారణం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-31T11:17:38+05:30 IST