కోటంరెడ్డిని టార్గెట్ చేసిన వైసీపీ..
ABN, First Publish Date - 2023-10-28T11:03:47+05:30
నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్వహించిన శాంతి ర్యాలీని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా.. అనూహ్య స్పందన రావడంతో వైసీపీ నేతలకు మింగుడు పడలేదు.
నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్వహించిన శాంతి ర్యాలీని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా.. అనూహ్య స్పందన రావడంతో వైసీపీ నేతలకు మింగుడు పడలేదు. అనంతర పరిణామాల్లో కోటంరెడ్డిపై ఆరు అక్రమ కేసులు పెట్టడం కుట్రలో భాగమేనన్న వాదనలు ఉన్నాయి. ఆయన వర్గీయులపై కూడా అక్రమకేసులు పెడుతూ మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కోటంరెడ్డి అనుచరులను నయానో భయానో బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించడం హాట్ టాపిక్‌గా మారింది. అందుకు ఎంత ఖర్చు అయినా పెట్టడానికి వెనుకాడడంలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-28T11:03:47+05:30 IST