బాలాసోర్ ట్రాక్ పనులు.. రైళ్ల రాకపోకలు యధాతథం
ABN, First Publish Date - 2023-06-05T10:33:52+05:30
ఒడిశా: బాలాసోర్ రైలు ప్రమాదంలో సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ రూట్‌లో రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.
ఒడిశా (Odisha): బాలాసోర్ (Balasore) రైలు ప్రమాదంలో (Rail Accident) సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ రూట్‌లో రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు బోగీలన్నీ తుక్కు తుక్కు అయ్యాయి. దీంతో సహాయక చర్యలను వేగంగా పూర్తి చేసిన అధికారులు వెంటనే పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మకాం వేసి ట్రాక్ పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-05T10:33:52+05:30 IST