అక్రమ అరెస్టులను ఖండించిన చినరాజప్ప
ABN, First Publish Date - 2023-09-12T11:58:07+05:30
రాజమండ్రి: టీడీపీ నేతల అక్రమ అరెస్టులను మాజీ హోంమంత్రి చినరాజప్ప తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లేందుకు టీడీపీ అధిష్టానం ఒక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు.
రాజమండ్రి: టీడీపీ నేతల అక్రమ అరెస్టులను మాజీ హోంమంత్రి చినరాజప్ప తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లేందుకు టీడీపీ అధిష్టానం ఒక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు రక్షణలేదని, ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. చంద్రబాబు సభల్లో వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరినా.. చెప్పులు వేసినా డీజీపీ పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీస్ యంత్రాంగాన్ని జగన్ తన కంట్రోల్లో పెట్టుకుని నడిపిస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-12T11:58:07+05:30 IST