TDP Manifesto: టీడీపీ వరాలు.. వైసీపీ నేతలకు జ్వరాలు..
ABN, First Publish Date - 2023-05-30T11:13:49+05:30
రాజమహేంద్రవరం వేదికగా మహానాడుకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో దానికి అధికారపార్టీ నేతలు విస్తృతంగా తమదైన సొంత భాషలో ప్రచారం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం వేదికగా మహానాడు (Mahanadu)కు సంబంధించి జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మినీ మేనిఫెస్టో (Mini Manifesto) ప్రకటించిన నేపథ్యంలో దానికి అధికారపార్టీ నేతలు విస్తృతంగా తమదైన సొంత భాషలో ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా టీడీపీకి సంబంధించిన మినీ మేనిఫెస్టోను వైసీపీ భుజానికెత్తుకుని మరీ ప్రచారం చేస్తోందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీన్నే కాగలకార్యం గంధర్వులు తీరుస్తున్నారంటారు. టీడీపీకి లభించాల్సిన ప్రచారాన్ని వైసీపీ నాయకులే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. మినీ మేనిఫెస్టో ప్రకటన చేసిన సాయంత్రం నుంచి.. వైసీపీ నేతలు ఈ రోజు వరకు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీ మినీ మేనిఫెస్టోకు విపరీమైన ప్రచారాన్ని కల్పిస్తున్నారు. టీడీపీ ప్రకటించిన వరాలకు.. వైసీపీ నాయకులకు ఎందుకింత జ్వరమొస్తోంది? ఇది మినీ మేనిఫెస్టోనే కదా... దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తే వైసీపీ నేతలు కోమాలోకి వెళిపోతారా? అంటూ టీడీపీ నాయకులు కూడా నేరుగా కౌంటర్‌కు ఎన్ కౌంటర్ ఇస్తూ గట్టిగా సమాధానాలు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి?
Updated Date - 2023-05-30T11:13:49+05:30 IST