తులం బంగారం కంటే... మిర్చి రేటే ఎక్కువ
ABN, First Publish Date - 2023-05-06T16:54:29+05:30
ఈ ఏడాది మిర్చికి రికార్డు స్థాయిలో ధర వస్తోంది. తాజా వరంగల్ ఎనుమాముల మార్కెట్లో దేశీయ మిర్చికి క్వింటాకు రూ. 80100 పలికింది
ఈ ఏడాది మిర్చికి రికార్డు స్థాయిలో ధర వస్తోంది. తాజా వరంగల్ ఎనుమాముల మార్కెట్లో దేశీయ మిర్చికి క్వింటాకు రూ. 80100 పలికింది. ఈ ధర ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే దేశీయ కొత్త మిర్చికి రికార్డు ధర పలికిందని వ్యాపారులు వివరిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఓ రైతు నాలుగు బస్తాల మిర్చిని ఎనుమాముల మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ మిర్చిని కొనుగోలు చేసేందుకు పోటీలు పడ్డారు. చివరికి రూ. 80100కు వ్యాపారులు ఈ మిర్చిని కొనుగోలు చేశారు. గతంలో ఇదే మిర్చి రూ. 20 వేలకు పైగా ధర పలికింది.
Updated Date - 2023-05-06T17:05:31+05:30 IST