Gujarath: హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు..
ABN, First Publish Date - 2023-07-07T11:36:01+05:30
గుజరాత్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో రాహుల్‌కు స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.
గుజరాత్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో రాహుల్‌కు స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. రెండు నెలల క్రితం దీనికి సంబంధించిన విచారణ పూర్తయింది. అయితే వెకేషన్ తర్వాత దీనిపై శుక్రవారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ఇది మళ్లీ సెషన్స్ కోర్టులో దీనికి సంబంధించి వినాలని, అక్కడే దీనిపై విచారణ జరిపించాలంటూ న్యాయస్థానం పేర్కొంది. కాగా పరువునష్టానికి సంబంధించిన కేసులో రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-07T11:36:01+05:30 IST