ప్రియాంక ప్రసంగం.. గుర్తుకొచ్చిన ఇందిర..
ABN, First Publish Date - 2023-10-19T11:26:01+05:30
వరంగల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. రాష్ట్రంలో కీలక నేతలు కూడా రాహుల్ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...
వరంగల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. రాష్ట్రంలో కీలక నేతలు కూడా రాహుల్ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇక నుంచి రాహుల్ తరచుగా రాష్ట్రానికి వస్తారని చెప్పారు. అలాగే నిన్న విజయభేరీ సభలో ప్రియంక గాంధీ ప్రసంగం.. ఇందిరా గాంధీ గుర్తుకువచ్చే విధంగా ఉందన్నారు. ప్రియాంక మాట్లాడుతుంటే ఇందిరా గుర్తుకు వచ్చారని చాలా మంది తనకు ఫోన్ చేశారన్నారు. ఈసారి కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ మేనిఫేస్టోను బీఆర్ఎస్ కాపీ చేసిందని కోమటిరెడ్డి ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-19T11:26:01+05:30 IST