AP News: గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన.. పరుగులు పెడుతున్న అధికారులు..
ABN, First Publish Date - 2023-05-10T11:54:56+05:30
ABN Indeter Desk: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.
ABN Indeter Desk: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పవన్ పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం పొలంలోకి పరుగులు పెడుతోంది. ధాన్యం కొనుగోలు చేస్తామంటూ రైతుల వద్దకు వెళుతున్నారు. తడిసిన ధాన్యాన్ని గోనె సంచుల్లో వేసి మిల్లులకు తరలిస్తున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని బలవంతంగా ట్రాక్టర్లలో మిల్లర్లవద్దకు తీసుకువెళుతున్నారు.
దెబ్బతిన్న పొలాలను పవన్ పరిశీలిస్తారని జనసేన పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తెలిపారు. కడియం ఆవభూముల్లో పంటలను పవన్ పరిశీలిస్తారని అన్నారు. తర్వాత రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. కోనసీమ జిల్లా అవిడలో రైతులతో పవన్ మాట్లాడతారని అనంతరం పీ. గన్నవరం మండలం, రాజీవ్ పాలెంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని దుర్గేష్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-05-10T11:54:56+05:30 IST