బాలినేనిని కూల్ చేసేందుకు వైసీపీ తంటాలు.. పంతం నెగ్గించుకున్న మాజీ మంత్రి
ABN, First Publish Date - 2023-05-06T17:38:14+05:30
ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కూల్ చేసేందుకు వైసీపీ పెద్దలు తంటాలు పడుతున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కూల్ చేసేందుకు వైసీపీ పెద్దలు తంటాలు పడుతున్నారు. బాలినేని అసంతృప్తి తగ్గించేందుకు వైసీపీ పాట్లు పడుతోంది. దీంతో ఒంగోలు డీఎస్పీ అశోక్ వర్ధన్‌పై బదిలీ వేటు వేసింది. అశోక్ స్థానం దర్శి డీఎస్పీకి వైసీపీ సర్కారు పోస్టింగ్ ఇచ్చింది. అశోక్ వర్ధన్‌కు ఒంగోలు డీఎస్పీ పోస్టింగ్ ఇవ్వడంపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలు డీఎస్పీగా అశోక్‌ను నియమించడంపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఒంగోలు డీఎస్పీగా పోస్టింగ్ తీసుకున్న గంటల వ్యవధిలోనే అశోక్ వర్ధన్‌పై బదిలీ వేటు పడింది.
Updated Date - 2023-05-06T17:50:37+05:30 IST