విజయనగరం: వైసీపీ కార్యకర్తలకు మద్యం పంపిణీ..
ABN, First Publish Date - 2023-08-25T11:08:58+05:30
విజయనగరం: సీఎం జగన్ సభలకు వస్తున్న జనానికి వైసీపీ నేతలు మద్యం పంచుతున్నారు. ముఖ్యమంత్రి సభా వేదిక దగ్గర కార్యకర్తలకు మద్యం పంపిణి యేధేచ్చగా సాగుతోంది. ఉదయాన్నే వైసీపీ నేతలు మద్యం పంపిణి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
విజయనగరం: సీఎం జగన్ సభలకు వస్తున్న జనానికి వైసీపీ నేతలు మద్యం పంచుతున్నారు. ముఖ్యమంత్రి సభా వేదిక దగ్గర కార్యకర్తలకు మద్యం పంపిణి యేధేచ్చగా సాగుతోంది. ఉదయాన్నే వైసీపీ నేతలు మద్యం పంపిణి చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. శుక్రవారం విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మెంటాడ మండలం, చినమేడపల్లిలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం దత్తిరాజేరు మండలం, కుంతినవలస దగ్గర జగన్ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీఎం సభకు భారీగా జనాలను తరలిస్తున్నారు. వచ్చే కార్యకర్తలకు మద్యం పంపిణి చేస్తున్నారు. అయితే నాయకులు ఇచ్చారు కాబట్టి తాము తాగుతున్నామని కార్యకర్తలు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-25T11:08:58+05:30 IST