కాంగ్రెస్ లేఖపై కేటీఆర్ ఆగ్రహం..
ABN, First Publish Date - 2023-10-26T11:34:22+05:30
హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బంధు పథకం ఆపాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ రాయడంపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటల కరెంట్ కూడా ఆపేయమంటారేమో అని కామెంట్ చేసిన కేటీఆర్..
హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బంధు పథకం ఆపాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ రాయడంపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటల కరెంట్ కూడా ఆపేయమంటారేమో అని కామెంట్ చేసిన కేటీఆర్.. అందులో కూడా కేసీఆరే కనిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని మంత్రి ట్వీట్ చేశారు. అన్నదాత పాలిట నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకొసారి తెలిపోయిందన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపటి కాంగ్రెస్ కుట్రలు.. తెలంగాణ రైతులు సహించరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-26T11:34:22+05:30 IST