AP News: ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి అరెస్టు..
ABN, First Publish Date - 2023-05-10T12:44:29+05:30
అమరావతి: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను జగన్ సర్కార్ విధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు విమర్శించారు.
అమరావతి: ఏపీ రాజధాని (AP Capital) మాస్టర్ ప్లాన్ (Master plan)ను జగన్ సర్కార్ (Jagan Govt.) విధ్వంసం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు (Kolikipudi Srinivasa Rao) విమర్శించారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. ఇందుకు వ్యతిరేకంగా తుళ్లూరు శిబిరం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిబిరం వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన శ్రీనివాసరావును పోలీసులు ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆమరణ దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శ్రీనివాసరావు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-05-10T12:44:29+05:30 IST