అసెంబ్లీ ఎన్నికల బరిలో కిషన్ రెడ్డి సతీమణి
ABN, First Publish Date - 2023-08-22T11:34:56+05:30
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరోవారం పది రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి కూడా తొలిసారి అసెంబ్లీ బరిలో నిలవాలని అనుకుంటున్నట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-22T11:34:56+05:30 IST