బాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో విచారణ..
ABN, First Publish Date - 2023-10-17T11:02:47+05:30
విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు వైద్య నివేదికపై మంగళవారం విచారణ జరగనుంది. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి నివేధిక ఇవ్వడంలేదని పిటిషన్ వేశారు. బాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని..
విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు వైద్య నివేదికపై మంగళవారం విచారణ జరగనుంది. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి నివేధిక ఇవ్వడంలేదని పిటిషన్ వేశారు. బాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సోమవారం పిటిషన్ వేశారు. దీనిని స్వీకరించిన న్యాయస్థానం ఈరోజు విచారణ జరుపుతామని తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టులో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినప్పటి నుంచి సదుపాయాల విషయంలో ప్రభుత్వం కనీస ధర్మం పాటించడంలేదని బాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-17T11:02:47+05:30 IST