తెలంగాణ వ్యాప్తంగా జోరు వాన..
ABN, First Publish Date - 2023-09-05T12:34:49+05:30
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. ఉపరితల ఆవర్తనంతో రెండు రోజుల క్రితం మొదలైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. సోమవారం ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా కురుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. ఉపరితల ఆవర్తనంతో రెండు రోజుల క్రితం మొదలైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. సోమవారం ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా కురుస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి, మరికొన్ని చోట్ల రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల పొలాలు నీట మునిగాయి. మంగళ, బుధవారాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.
Updated Date - 2023-09-05T12:34:49+05:30 IST