కోడికత్తి కేసుపై నేడు హైకోర్టులో విచారణ..
ABN, First Publish Date - 2023-10-13T11:18:10+05:30
అమరావతి: కోడికత్తి కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనే జగన్ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది.
అమరావతి: కోడికత్తి కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనే జగన్ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది. కోడికత్తి కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చిచెప్పింది. ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను జగన్ హైకోర్టులో సవాల్ చేశారు. కోడికత్తి కేసు సుమారు ఐదేళ్లుగా సాగుతోంది. నిందితుడు కోడికత్తి శ్రీను కూడా జైల్లోనే మగ్గుతున్నాడు. తనకు ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఇస్తే బెయిల్ వస్తుందని సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అయినా జగన్ ఎన్‌వోసి ఇవ్వలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-13T11:18:10+05:30 IST