చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ
ABN, First Publish Date - 2023-10-09T10:15:15+05:30
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పిటిషన్‌పై గత వారం సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఏపీ హైకోర్టులో సమర్పించిన డాక్యుమెంట్లు అన్నింటిని సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణ సోమవారం నాటికి వాయిదా వేసింది. ఈరోజు సుప్రీంకోర్టు కేసుల జాబితాలో 59వ నెంబర్ కేసుగా చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ నమోదైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-09T10:15:15+05:30 IST