ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం డెడ్‌లైన్..

ABN, First Publish Date - 2023-05-09T13:01:25+05:30

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ గ్రేడ్ 4 ఉద్యోగులుగా గుర్తించి సర్వీస్ కలుపుతూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను (Junior Panchayat Secretaries) రెగ్యులర్ చేస్తూ గ్రేడ్ 4 (Grade 4) ఉద్యోగులుగా గుర్తించి సర్వీస్ కలుపుతూ జీవో (GO) విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt.) 9,355 పంచాయతీ జూనియర్ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన నోటిషికేషన్‌ను 2018లో ఇస్తే.. సుమారు 15 లక్షల మంది ఈ ఉద్యోగానికి దరకాస్తు చేసుకున్నారు. మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ నిబంధనలతో రూ. 15వేల జీతంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకుని మూడేళ్ల తర్వాత గ్రేడ్ 4 ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేస్తాం అని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఇంతవరకు వారిని రెగ్యూలర్ చేయలేదు. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మెకు దిగారు. కాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధుల్లోకి చేరకపోతే వారిని శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగిస్తామని సోమవారం పంచాయతీరాజ్ సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-09T13:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising