Cabinet Meeting: తెలంగాణ కొత్త సచివాలయంలో తొలి సమావేశం నేడు..
ABN, First Publish Date - 2023-05-18T10:46:58+05:30
తెలంగాణ మంత్రి వర్గం (Telangana Cabinet) గురువారం సమావేశం కానుంది. సాయంత్రం మూడు గంటలకు సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన సమావేశం జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గం (Telangana Cabinet) గురువారం సమావేశం కానుంది. సాయంత్రం మూడు గంటలకు సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన సమావేశం జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) నూతన సచివాలయం (New Secretariat)లో తొలిసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో గత అసెంబ్లీ సమావేశంలో ఆమోదం పొందిన రెండు బిల్లులను గవర్నర్ తిప్పి పంపడంతో వాటికి సవరణలు మార్పులు, చేర్పులు చేయడంపై చర్చించనున్నారు. అసెంబ్లీ సెషన్ పెట్టడంపై గతంలోనే చర్చలు జరిగినా ప్రభుత్వం తేదీలను ఖరారు చేయలేదు. ఈ కేబినెట్ సమావేశంలో రెండు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-18T10:46:58+05:30 IST