చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు..
ABN, First Publish Date - 2023-10-06T10:38:38+05:30
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలవనున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికి బయలుదేరారు.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలవనున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికి బయలుదేరారు. అక్కడి నుంచి సాయంత్రం 3 గంటలకు జైల్లో ములాఖత్‌కు వెళతారు. లోకేష్‌తోపాటు భువనేశ్వరి, బ్రహ్మణి కూడా వెళతారు. ముందుగా జైల్లో చంద్రబాబు ఎలా ఉన్నారు? అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుంటారు. తర్వాత జనసేనతో సమన్వయ కమిటీతోపాటు పార్టీ కార్యక్రమాలవంటి అంశాలపై చంద్రబాబుతో లోకేష్ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-06T10:40:32+05:30 IST