ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: ఢిల్లీలో కాంగ్రెస్ సంబరాలు.. బీజేపీ శిబిరంలో నిరాశ..

ABN, First Publish Date - 2023-05-13T12:09:31+05:30

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Karnataka Assembly Election Results) కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యధిక అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Karnataka Assembly Election Results) కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యధిక అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఐదారు స్థానాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో (Delhi Congress Headquarter) కోలాహలం నెలకొంది. సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణస్వీకార చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. అదీగాక సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖర్గేకు తొలి విజయంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో కూడా కొంత ఆక్సిజన్ ఇస్తుంది. కర్నాటకలో 224 స్థానాలకు గానూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫలితాలను చూస్తే.. 115 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 65, జేడీఎస్ అభ్యర్థులు 26 స్థానాల్లో కొనసాగుతున్నారు. బీజేపీ, జేడీఎస్ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ శిబిరంలో కొంత నిరాశ నెలకొంది.

Updated Date - 2023-05-13T12:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising