వైసీపీలో వర్గ విభేదాలు..
ABN, First Publish Date - 2023-06-29T11:20:29+05:30
ప్రకాశం జిల్లా: ‘ఒకవైపు వైనాట్ 175’ అని వైసీపీ అధినేత, సీఎం జగన్ గొప్పగా చెబుతుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం ఆధిపత్యం కోసం తన్నుకుంటున్నారు.
ప్రకాశం జిల్లా: ‘ఒకవైపు వైనాట్ 175’ అని వైసీపీ అధినేత, సీఎం జగన్ గొప్పగా చెబుతుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం ఆధిపత్యం కోసం తన్నుకుంటున్నారు. ప్రకాశంజిల్లా కొండెపిలో వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మిట్టపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యేందుకు నియోజకవర్గం ఇన్చార్జ్ అశోక్‌బాబు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మిట్టపాలెంలో మరో వర్గం నేతలు అశోక్‌బాబు మా ఇంటికి రావద్దు జగనన్నే ముద్దు.. అంటూ ఇళ్లముందు పోస్టర్లు అంటించారు. దీంతో గ్రామంలోని రెండు వర్గాల మద్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-29T11:20:29+05:30 IST